అన్యాయం చేసి…ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా?
జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేసిన ప్రధాని మోదీ స్పందనకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రతి స్పందించారు. విభజనకు నిరసనగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు నిరసన గళం వినిపిస్తుంటుంటే, రాష్ట్రానికి అన్యాయం చేసి ఇప్పుడు శుభాకాంక్షలు చెబుతారా? కేంద్రం హోదాతో సహా విభజన హామీలు నెరవేర్చలేదని, ప్రజలంతా తీవ్ర ఆవేదనలో ఉంటే ట్వీట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలను సంతృప్తి పరచాలని మీరు అనుకుంటున్నారా? ప్రజల ఆవేదన ఎలా ఉందో మీరు అర్థం చేసుకోవాలి అంటూ నెటిజన్లు చేసిన కామెంట్లను జతపరచి ప్రధాని మోదీకు ట్వీట్ చేశారు. ఇప్పటికైనా ఏపీ ప్రజల మనోభావాలను గౌరవిస్తారని కోరుకుంటున్నానని, ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కుల అని లోకేశ్ ట్వీట్లో పేర్కొన్నారు.













