ఘనంగా లోకేశ్ జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీ రాజ్, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ జన్మదిన వేడుకలు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మంత్రి కళా మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధికి లోకేశ్ అంకిత భావంతో పనిచేస్తున్నారని కొనియాడారు. కాబోయే ముఖ్యమంత్రి లోకేశ్ అని మంత్రి ఆనందబాబు అన్నారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జి.వి.అంజనేయులు, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్షుడు బ్రహ్మం చౌదరి, ఎమ్మెల్యే ఫిలిప్థోచర్, ఎమ్మెల్సీ రామకృష్ణ, నాయకులు రాయపాటి రంగారావు, మన్నవ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.













