Nara Lokesh : ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం : మంత్రి లోకేశ్

విశాఖకు 6,000 మెగావాట్ల డేటా సెంటర్లు తీసుకురావాలన్నదే ప్రస్తుతం తమ ముందున్న లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడిరచారు. ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో లోకేశ్ మీడియాతో మాట్లాడుతూ మాట్లాడుతూ రాష్ట్రంలో 15 బిలియన్ డాలర్ల పెట్టుబడితో 1,000 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. ఇటీవల విశాఖలో సిఫీ సంస్థ 500 మెగావాట్ల డేటా సెంటర్ ఏర్పాటుకు శంకుస్థాపన చేసిందని గుర్తు చేశారు. త్వరలో మరిన్ని కంపెనీల పెట్టుబడులు విశాఖకు రానున్నాయన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్ (Microsoft) హైదరాబాద్ రూపురేఖలు మార్చినట్లుగానే ఇప్పుడు గూగుల్ (Google) విశాఖ రూపురేఖలు మార్చబోతోందని ప్రకటించారు. దీనివల్ల కేబుల్ ల్యాండిరగ్ స్టేషన్, పునరుత్పాదక ఇంధనం, ఏఐకి సంబంధించిన అనేక అనుబంధ కంపెనీలు విశాఖకు వస్తాయన్నారు. ఈ ఒక్క పెట్టుబడి వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 1.88 లక్షల ఉద్యోగాలు వస్తాయని వెల్లడిరచారు. 2014-19లో కియా కార్ల (Kia cars) కంపెనీ తెచ్చాం. ఇప్పుడు ఆ చరిత్రను తిరగరాస్తున్నాం. చరిత్ర సృష్టించాలన్నా, తిరగరయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. ఇప్పటి వరకు రాష్ట్రానికి 125 బిలియన్ డాలర్ల పెట్టుబడుల ప్రతిపాదనలు వచ్చాయి. కొత్త పెట్టుబడులపై మరింత దృష్టి సారిస్తున్నాం అని పేర్కొన్నారు.