పోలింగ్ ముగిసిన వెంటనే సర్వే ఫలితాలు : లగడపాటి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు రోజుల్లో జరుగుతున్న ఎన్నికల్లో తాము ఎవరికి ఓటు వేయాలో ప్రజలకు తెలుసునని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. తిరుమల శ్రీవారి దర్శించుకునేందుకు వచ్చిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. అనుభవజ్ఞులకే ప్రజలు పట్టం కడతారని తాను భావిస్తున్నట్లు తెలిపారు. ఏపీ భవిష్యత్తు కోసం అనుభవజ్ఞుల అవసరం ఎంతైనా ఉందని, ప్రజలు దీన్నే పరిగణనలోకి తీసుకుంటారని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసిన తరువాతే ప్రజలు తమ ఓటును వేస్తారని అన్నారు. తుది విడత ఎన్నికల పోలింగ్ ముగిసిన తరువాత తన సర్వే ఫలితాలు వెల్లడిస్తానని తెలిపారు.













