పథకం ప్రకారమే నాపై దాడి : కోడెల
పథకం ప్రకారమే ఇనిమెట్లలో తనపై దాడి జరిగిందని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు అన్నారు. సీఎం చంద్రబాబుతో కోడెల భేటీ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ, మోదీ, ఈసీ అంతా ఒకటే గ్యాంగ్ అని విమర్శించారు. వైసీపీ, ఈసీ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాయని మండిపడ్డారు. గొడవలు చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర బలగాలు పంపలేదని ఆరోపించారు. కేంద్రం, ఈసీ ఏకక్షంగా వ్యవహరించాయని ధ్వజమెత్తారు. మీడియా, పోలీసులు, గన్మెన్లపై కూడా దాడి చేశారని వెల్లడించారు. ఆ బూత్‌లో పోలింగ్ ప్రక్రియ ఎలా జరిగిందో చూడాలని కోరారు. కావాలంటే సీసీటీవీ పుటేజ్ చూడాలని విజ్ఞప్తి చేశారు. ఇనిమెట్ల ఘటనపై పూర్తి వివరాలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు. రెచ్చగొట్టే ధోరణితో వైసీపీ వ్యవహరించిందన్నారు. కేసులు పెట్టినా తాను భయపడేది లేదన్నారు. వాస్తవాలు తెలియాలని డిమాండ్ చేశారు.













