AP Cabinet: ఏపీ కేబినెట్ భేటీ … కీలక నిర్ణయాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం (Cabinet meeting) ముగిసింది ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముత్తుకూరులో ఏపీఐఐసీ (APIIC)కి 615 ఎకరాలు కేటాయించేందుకు కేబినెట్ అనుమతిచ్చింది. ఇక్కడ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. తాడిమర్రిలో అదానీ పవర్ (Adani Power )కు 500 మెగావాట్లు, కొండాపురంలో 1000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులకు భూ కేటాయింపునకు ఆమోదం తెలిపిది. ఎకరానికి రూ.5 లక్షల చొప్పున భూమి కేటాయించాలని కేబినెట్ నిర్ణయించింది.
నిర్ణయాలు ఇవే :
– 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ల నియామకానికి కేబినెట్ ఆమోదం.
– హైదరాబాద్‌లోని పొట్టిశ్రీరాములు తెలుగు యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్‌కు తరలించే ప్రతిపాదనకు ఆమోదం.
– విద్యార్థులకు కోచింగ్ ఇచ్చేందుకు స్టడీసెంటర్ల ఏర్పాటుకు అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీకి అనుమతి.
– అమరావతి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ద్వారా లీగల్ వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం.
– దుకాణాల ద్వారా రేషన్, ఇతర సరుకులు ఇచ్చే ప్రతిపాదనపై కేబినెట్లో చర్చ.
– భోగాపురం వద్ద 500 ఎకరాల కేటాయించే మంత్రుల బృందం ప్రతిపాదనకు ఆమోదం.
– ఏపీ లెదర్ ఫుట్‌వేర్ పాలసీ 4.0కి కేబినెట్ ఆమోదం.
– పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో ఆమోదించిన 11 సంస్థలకు కేబినెట్ ఆమోదం.
– రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 35 వేల ఉద్యోగాల కల్పనకు కేబినెట్ ఆమోదం. మంత్రివర్గ అజెండాలోని అంశాల తర్వాత తాజా పరిణామాలపై చంద్రబాబు చర్చించారు. మద్యం స్కామ్‌పై విచారణ పారదర్శకంగా జరుగుతోందని చెప్పారు. ఎవరూ తొందరపడి మాట్లాడి అనవసర వివాదాలను తావివ్వొద్దని మంత్రులకు సూచించారు. ప్రధాని (Prime Minister) ఆధ్వర్యంలో జరిగే యోగా డేను విజయవంతం చేయాలన్నారు.













