చిలికి చిలికి గాలివానగా మారుతున్న బెజవాడ బ్రదర్స్ ఫోన్ టాపింగ్..
కేశినేని నాని, చిన్నిల ఫోన్ టాపింగ్ వ్యవహారం రోజు రోజుకి పెద్దదవుతుంది. ఈ బెజవాడ బ్రదర్స్ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపణలు. వైసీపీ తరఫున కేసినేని.. టీడీపీ తరఫున కేశినేని చిన్ని విజయవాడ ఎంపీ స్థానానికి పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి పేర్లు అధికారికంగా కూడా ఆయా పార్టీలు ప్రకటించాయి. దీంతో ప్రచారం మొదలుపెట్టిన అన్నదమ్ములు కారాలు మిరియాలు నూరుతు ఘాటు విమర్శలతో నిందారోపణలు చేసుకుంటున్నారు. ఎప్పటినుంచో చంద్రబాబు తెలంగాణ నుంచి తన ఫోన్ టాపింగ్ చేస్తున్నాడు అని కేశినేని నాని ఆరోపించారు. దీనిపై స్పందించిన కేశినేని చిన్ని జగన్ ప్రభుత్వం తన ఫోన్ ని టాపింగ్ చేస్తోంది అని మండిపడ్డారు. పైగా ఈ టాపింగ్ వెనుక కేశినేని నాని హస్తం ఉంది అని ధ్వజమెత్తారు. ఈ విషయం పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేస్తానని హెచ్చరించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఈ బెజవాడ బ్రదర్ ఇద్దరు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటూ వైరల్ అవుతున్నారు.













