కుమారస్వామితో సీఎం చంద్రబాబు భేటీ
కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలోని గేట్ వే హోటల్లో సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు వీరి భేటీ జరిగింది. ఈ భేటీ రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. భేటీ అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ మర్యాదపూర్వకంగా తాము కలిసినట్లు తెలిపారు. ఎన్డీయేను ఓడించేందుకు కలిసొచ్చే అన్ని ప్రాంతీయ పార్టీలను కలుపుకొనిపోతామని చంద్రబాబు సృష్టం చేశారు. ముఖ్యంగా దక్షిణాదిలో ఉన్న అన్ని పార్టీలను ఏకం చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పుడు ప్రాథమికంగా కొన్ని చర్చలు జరిపినట్లు మరోమారు భేటీ అవుతామని తెలిపారు. ఈ సమావేశంలో మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, ప్రతిపాటి పుల్లారావు, ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు.













