సీఎం జగన్ దే బాధ్యత : రామ్మోహన్ రావు
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు ముప్పు వాటిల్లితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే బాధ్యత అని ఆ పార్టీ సీనియర్ నేత, కంభంపాటి రామ్మోహన్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఫ్రాణాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెలగాటం ఆడుతోంది. ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసి అడ్డుతొలగించుకోవాలని చూస్తోందన్నారు. చేయని నేరానికి, జరగని అవినీతికి చంద్రబాబును జైల్లో పెట్టారు. డీహైడ్రేషన్, స్కిన్ అలర్జీలపై వారం రోజుల క్రితమే చంద్రబాబు ఫిర్యాదు చేసినా సరైన చికిత్స అందించకుండా, కనీస వసతులు కల్పించకుండా నిర్లక్ష్యం చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. చంద్రబాబు ఆరోగ్యం క్షీణించింది అనేదానికి వైద్యులిచ్చిన ఎమర్జెన్సీ మెడికల్ రిపోర్టే ఆధారం. చంద్రబాబుకు వెంటనే వైద్య సేవలు అందించాలి అని డిమాండ్ చేశారు.













