అనంత రాజకీయాల్లో అద్భుతం..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా రాజకీయాల్లో అద్భుతం చోటు చేసుకుంది. జిల్లాలో ఒకప్పుడు ఉప్పు-నిప్పులా ఉన్న జేసీ, పరిటాల కుటుంబాలు ఇప్పుడు అప్యాయంగా దగ్గరవుతున్నాయి. అందుకు కారణం తెలుగుదేశం పార్టీ కావడం విశేషం. ఇప్పుడు ఏపీలో ఏర్పడిన పరిస్థితుల దృష్ట్యా ఉమ్మడి శత్రువైన వైసీపీని దెబ్బతీసేందుకు జేసీ, పరిటాల కుటుంబాలు శత్రుత్వం వదిలి మిత్రులుగా మారాయి. ఈ నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అనంతపురం జిల్లా పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా లోకేశ్‌ను స్వాగతించేందుకు జేసీ కుటుంబం నుంచి ప్రభాకర్ రెడ్డి, పరిటాల కుటుంబం నుంచి శ్రీరామ్ వచ్చారు. అక్కడ ఇద్దరు కలిసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి కల్మషం లేకుండా సొంత బిడ్డలా శ్రీరామ్‌ను దగ్గరు తీసుకున్నారు. శ్రీరామ్ కూడా ప్రభాకర్ రెడ్డి పెద్దరికాన్ని గౌరవించి ఆప్యాయంగా దగ్గరకు వెళ్లారు. జేసీ ప్రభాకర్ రెడ్డి, శ్రీరామ్ ఆలింగేనం చేస్తున్న దృశ్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.













