గవర్నర్‌తో పవన్ కల్యాణ్ భేటీ
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌ను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలిశారు. హరిచందన్ రాష్ట్ర గవర్నర్‌గా ప్రమాణస్వీకారం చేసిన సమయంలో పవన్ కల్యాణ్ అందుబాటులో లేకపోవడంతో హాజరు కాలేకపోయారు. ఇవాళ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిశారు. పార్టీ తరపున ఆయన శుభాకాంక్షలు తెలిపారు. తమ పార్టీ సిద్ధాంతాలు, కార్యకలాపాల గురించి బిశ్వభూషణ్ హరిచందన్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. గవర్నర్‌ను కలిసిన వారిలో జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్, నాగబాబు ఉన్నారు.













