ఎన్నికల మహా సంగ్రామంలో అభిమన్యుడిని కాదు అర్జునుడిని..జగన్..
ఏపీలో మే 13న జరగబోయే పోలింగ్ నేపథ్యంలో నిన్నటితో ప్రచారాలు ముగిసిపోయాయి. నిన్నటి వరకు తమ గురించి తాము మాట్లాడుకోవడంతోపాటు ప్రత్యర్థులపై మాటలు యుద్ధం చేసిన నాయకుల గొంతులు సైలెంట్ అయిపోయాయి. గెలుపు కూటమిదా లేక ఒంటరి పోరాటం చేస్తున్న జగన్‌దా అన్న విషయం జూన్ 4 కి తేలిపోతుంది. ఇక ఎన్నికల నేపథ్యంలో జగన్ తనని తాను అర్జునుడిగా అభివర్ణించి ప్రజలపై తనకున్న నమ్మకాన్ని మరొకసారి నిరూపించుకున్నారు. ఎన్నికల మహాసంగ్రామం లో పచ్చ మంద సృష్టించిన చక్ర వ్యూహంలో చిక్కుకుని వారి బాణాలకు బలైపోవడానికి తాను అభిమన్యుడుని కాదు అన్న జగన్ అర్జునుడిగా విజయంతో బయటికి వస్తాను అని పేర్కొన్నారు. ఆనాడు కృష్ణుడు అర్జునుడికి తోడుగా నిలిచినట్టు ఈనాడు ఎన్నికల మహాసంగ్రామం లో ప్రజలు తనకు కృష్ణుడిలా తోడు నిలుస్తారని ఎమోషనల్ గా ట్వీట్ పెట్టారు. దీనితో పాటుగా ఒక సభలో “మీ అండదండలు ఉన్నంతకాలం మీ బిడ్డ తొణకడు” అంటూ జగన్ మాట్లాడినా ఓ వీడియోని కూడా ఈ ట్వీట్ కు జత చేశారు.













