మేధా టవర్స్ లో ఐటీ కంపెనీలు ప్రారంభం
విజయవాడ శివారులోని గన్నవరంలో గల మేధా టవర్స్ లో ఏడు సాఫ్ట్వేర్ కంపెనీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. స్పెయిన్స్కు చెందిన గ్రూపో అంటోలిన్, జర్మనీకి చెందిన ఐఈఎస్, రోటోమేకర్, అమెరికాకు చెందిన మెస్లోవా కంపెనీలతోపాటు చందుసాఫ్ట్, ఈసీసాఫ్ట్, యమైహ్ ఐటీ సొల్యూషన్ కంపెనీలను నారా లోకేశ్ ప్రారంభించారు. ఏడు కంపెనీల్లో 1600 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. మేథా టవర్స్‌లోని రెండస్థుల్లో కంపెనీల కార్యకలాపాలు కొనసాగనున్నాయి. ఐటీ కంపెనీల ప్రతినిధులు, ఉద్యోగుల రాకతో మేధా టవర్స్ వద్ద సందడి వాతావరణం నెలకొంది.













