Union Budget: కేంద్ర బడ్జెట్ కోసం కసరత్తులు షురూ.. కీలక మీటింగ్‌కు హాజరైన ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్
వచ్చే ఏడాది ప్రవేశ పెట్టాల్సిన వార్షిక బడ్జెట్‌పై (Union Budget) కేంద్రం కసరత్తులు మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే 2025-26 సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ రూపకల్పన కోసం రాజస్థాన్‌లో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత వహించారు. బడ్జెట్ (Union Budget) రూపకల్పన కోసం అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను నిర్మలా సీతారామన్ తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ సమావేశంలో పాల్గొని తమ రాష్ట్ర అవసరాలను వివరించారు. అలాగే నదుల అనుసంధానం, పూర్వోదయా వంటి స్కీమ్‌ల కేటాయింపుల్లో ఏపీకి ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన కోరారు.













