పెట్టుబడులతో అమరావతికి రండి
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి అనేక అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులతో రావాలంటూ అమరావతి అభివృద్ధి కమిటీ పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చింది. థాయిలాండ్, మలేసియా, సింగపూర్ లలో అమరావతి అభివృద్ధి కమిటీ చైర్మన్, అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ కార్యదర్శి జాస్తి వీరాంజినేయులు నేతృత్వంలో అధికార బృందం పర్యటించి, విస్తృత ప్రచారం నిర్వహించారు. బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్లలో సదస్సులు నిర్వహించి విస్తృత ప్రచారం నిర్వహించారు. బ్యాంకాక్, కౌలాలంపూర్, సింగపూర్లలో సదస్సులు నిర్వహించి విస్తృత ప్రచారం చేశారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ పర్యటన బృందంలో దినకల్, సుబ్బయ్య, జయషీ తదితరులు ఉన్నారు.













