ఎపి ప్రజలకు మూడు సేవలు…
దేశంలోనే తొలిసారిగా ఇంటింటికీ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలన్న విప్లవాత్మక ఆలోచన కార్యరూపం దాల్చనుంది. కేవలం రూ.149కే ఇంటింటికీ ఇంటర్నెట్, టీవీ, టెలిఫోన్ సౌకర్యం అందించే ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఈనెల 27న భారత రాష్టప్రతి కోవింద్ ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఈ పథకంతో 55 గ్రామాల్లోని లక్ష ఇళ్లకు అంతర్జాల సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన నిరంతర విద్యుత్ పథకం తర్వాత ప్రవేశపెడుతున్న మరో విప్లవాత్మక పథకం ఫైబర్‌నెట్. అంతర్జాతీయ సాంకేతిక నిపుణులు ముచ్చటగా మూడు సేవలుగా అభివరి?స్తున్న ఈ పథకంలో ఒక కనెక్షన్ తీసుకుంటే గృహ వినియోగదారులకు 15 ఎంబీపీఎస్, వాణిజ్య అవసరాలకు 100 ఎంబీపీఎస్, 250 టీవీ ఛానెళ్లను ఆనందంగా వీక్షించే సదుపాయం, ఉచితంగా పరిమితి లేని ఫోన్‌కాల్స్ సేవలు లభిస్తాయి. ఈ శతాబ్దంలోనే ఒక అదుÄతే సాంకేతిక విప్లవంగా నిపుణులు దీన్ని ప్రశంసిస్తున్నారు. రాష్ట్రాన్ని డిజిటల్ ఆంధ్రగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో సీఎం చంద్రబాబు గత ఏడాది తూర్పుగోదావరి జిల్లా మోరిలో ఈ పథకానికి బీజం వేశారు.













