గన్నవరానికి అంతర్జాతీయ సర్వీసులు
గన్నవరం విమానాశ్రయంలో ఏడాదిలోగా అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర పౌరవిమానయాన శాక మంత్రి అశోక్ గజపతి రాజు తెలిపారు. రన్‌వే విస్తరణ పనులు పూర్తికి ఏడాది పడుతుందని, అవి పూర్వవ్యగానే అంతర్జాతీయ విమాన సర్వీసులు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రారంభమవుతాయన్నారు. ఢిల్లీలో తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రన్‌వే విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం 700 ఎకరాల భూమిని ఇచ్చిందని చెప్పారు. దీంతో వైడ్ బాడీ ఎయిర్‌క్రాఫ్ట్స్ దిగడానికి వీలవుతుందన్నారు. విజయవాడలో పాత టర్మినల్‌ను కొంత కాలం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం వినియోగించుకోవచ్చని సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి దాదాపుగా భూసేకరణ పూర్తయిందని, మరో 40-50 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందని తెలిపారు. ఇప్పటికే ఎయిర్కారిడార్ అనుతులు వచ్చాయని, త్వరలో పర్యావరణ అనుమతులు వస్తాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ కుదుర్చుకొని ముందుకెళ్తామని అన్నారు.













