మే 17 వరకూ అన్ని విమాన సేవలు బంద్
కేంద్ర ప్రభుత్వం లాక్డౌన్ను మరో రెండు వారాలపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) కూడా విమానాల రాకపోకలపై నిషేధాన్ని మరో రెండు వారాలపాటు పొడిగించింది. ఈ మేరకు డీజీసీఏ శనివారం సర్క్యులర్ జారీ చేసింది. దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు అన్నింటికీ ఈ నిషేధం వర్తిస్తుందని ఆ సర్క్యులర్లో పేర్కొన్నది. అయితే అంతర్జాతీయ కార్గో సర్వీసులకు, ప్రత్యేకంగా తమ అనుమతితో నడుస్తున్న కొన్ని విమానాలకు మాత్రం ఈ నిషేధం వర్తించదని డీజీసీఏ సృష్టం చేసింది. డీజీసీఏ జారీ చేసిన నూతన సర్క్యులర్ ప్రకారం మే 4 నుంచి 17వ తేదీ వరకు విమాన సర్వీసులపై నిషేధం కొనసాగతుంది.













