మూడు రాజధానులకు పూర్తి మద్దతు : రాపాక
ఆంధ్రప్రదేశ్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ప్రతిపాదనను స్వాగతిస్తున్నామని అసెంబ్లీ వేదికగా జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సృష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు అంశాలపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ఎమ్మెల్యే రాపాక ప్రసంగించారు. రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. విశాఖపట్టణం ఎగ్జిక్యూటివ్ రాజధాని అయితే వలసలు తగ్గుతాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి ఒకేచోట జరగడం సమంజసం కాదని, అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని చెప్పారు. ప్రతీ దాన్ని ప్రతిపక్షం వ్యతిరేకించడం భావ్యం కాదన్నారు. ప్రజాభిప్రాయం కూడా మూడు రాజధానుల నిర్ణయానికి అనుకూలంగా ఉందని అన్నారు.













