Vijay Diwas: అమరవీరులకు గవర్నర్, డిప్యూటీ సీఎం నివాళులు
విజయ్ దివస్ సందర్భంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లోని అమరవీరుల స్తూపం వద్ద తెలంగాణ గవర్నర్ జిష్టుదేవ్ వర్మ (Jishnu Dev Varma), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఘనంగా నివాళులర్పించారు. త్రివిధ దళాల అధికారులు నివాళులర్పించి గౌరవ వందనం చేశారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశ ఔన్నత్యాన్ని కాపాడటంలో నాటి ప్రధాని ఇందిరాగాంధీ (Indira Gandhi) కీలకపాత్ర పోషించారని చెప్పారు. సాహసోపేతమైన నిర్ణయాలతో 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధంలో భారత సైనికుల వీరోచిత పోరాటం మరువలేదని కొనియాడారు. భారత సైన్యం సాధించిన విజయానికి గుర్తుగా విజయ్ దివస్ (Vijay Diwas) నిర్వహిస్తున్నామని తెలిపారు. యుద్ధ భూమిలో పాల్గొన్న మాజీ సైనిక అధికారులు, సైనిక ఉద్యోగులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళులర్పించారు.






