నోటీసులు అందిన తర్వాత స్పందిస్తా
పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనకు హైకోర్టు నోటీసులు ఇంత వరకు అందలేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియా అన్నారు. నోటీసులు అందిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు. కర్నూలులో మీడియాతో మాట్లాడుతూ అమె ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన అఖిలప్రియ, ఆ తర్వాత తన తండ్రి భూమా నాగిరెడ్డితో కలసి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే. అనంతరం అమెను మంత్రి పదవి వరించింది. పార్టీ ఫిరాయింపుల కేసులో మంత్రులు అఖిలప్రియ, అమరనాథ్ రెడ్డి, ఆదినారాయణరెడ్డి, సుజయ్ కృష్ణ రంగారావులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.













