Chandrababu: ఇది ఏపీకే కాదు … దేశానికే గర్వకారణం : చంద్రబాబు

విశాఖలో గూగుల్ (Google) సంస్థ అతిపెద్ద డేటా సెంటర్‌ను ఏర్పాటు చేసే ప్రతిపాదనపై ఢల్లీిలో ఎంవోయూ కుదుర్చుకోనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వెల్లడిరచారు. 2029 నాటికి డేటాసెంటర్ (Data Center) ను సంస్థ పూర్తిచేస్తుందని పేర్కొన్నారు. ఇది ఏపీకే కాదు, దేశానికే గర్వకారణమవుతుందన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గూగుల్‌తో చరిత్రాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నాం. రాష్ట్రానికి ఇదో గేమ్‌ఛేంజర్ అవుతుంది. దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు సింగపూర్ (Singapore) నుంచి సబ్‌మైరన్ కేబుల్‌ను సముద్రంమార్గంలో సంస్థ ఏర్పాటు చేస్తుంది. ఈ ప్రాజెక్టు వచ్చినప్పుడు కలిగిన ఆనందం, అనుభూతి నాకెప్పుడూ కలగలేదు. ఈ నెల 16 నెలల్లో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. అందులో గూగుల్ ఒకటి. ఈ ప్రాజెక్టు రాష్ట్రానికి వచ్చేందుకు ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్, కేంద్ర ఐటీ మంత్రి సానుకూలంగా స్పందించారు అని పేర్కొన్నారు. ఇటుక ఇటుక పేర్చి హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దామని, మైక్రోసాఫ్ట్ (Microsoft) రావడంతో బ్రాండ్ ఇటుకా పేర్చి హైదరాబాద్‌ను మహానగరంగా తీర్చిదిద్దామని, మైక్రోసాఫ్ట్ రావడంతో బ్రాండ్ వచ్చిందని పేర్కొన్నారు. విశాఖకు గూగుల్ రాకతోనూ అదే పరిస్థితి వస్తుందన్నారు. విశాఖలో నవంబరు 14, 15 తేదీల్లో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు ప్రధాని ఆహ్వానించనున్నట్లు తెలిపారు.