రాజధానిపై ప్రభుత్వం సృష్టత ఇవ్వాలి : గల్లా
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు వైఎస్ తిరగతోడలేదని తెలుగుదేశం పార్టీ ఎంపీ గల్లా జయదేవ్ అన్నారు. అందుకే సైబరాబాద్, హైదరాబాద్ లాభపడ్డాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రంలో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని, ఇప్పటికైనా జగన్ తన తప్పు తెలుసుకోవాలని హితవుపలికారు. వరదల నష్టాలపై రాష్ట్ర ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని విమర్శించారు. వరద ఉధృతికి 6వేల ఎకరాలు నీట మునిగిపోయాయని అన్నారు. రాధాని అమరావతిపై వైసీపీ మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని, రాజధానిపై ప్రభుత్వం సృష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.













