అఖిలప్రియకు బెయిల్ మంజూరు
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు బెయిల్ మంజూరైంది. ఆమెకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు సికింద్రాబాద్ న్యాయస్థానం వెల్లడించింది. రూ.10 వేల పూచీకత్తు ఇద్దరు షూరిటీలను సమర్పించాలని కోర్టు ఆదేశించింది. చంచల్ గూడ జైల్లో 17 రోజులుగా అఖిల ప్రియ రిమాండ్లో ఉన్న విషయం విదితమే. రేపు అనగా శనివారం (23వ తేదీ) నాడు అఖిలప్రియ జైలు నుంచి విడుదల అయ్యే అవకాశం ఉంది. మరోవైపు ఆమె భర్త భార్గవ్ రామ్ ముందస్తు బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది.













