మునిగిపోయేది అమరావతి కాదు ప్రభుత్వ ప్రతిష్ట
కౌలు కోసం రైతులు ఆందోళన చేస్తున్నారనడం సరికాదని, మంత్రులు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఫైర్ అయ్యారు. మునిగిపోయేది అమరావతి కాదు అని ప్రభుత్వ ప్రతిష్ట అని వ్యాఖ్యానించారు.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అద్భుతమైన రాజధానిని కోల్పోతామన్న భయం రైతుల్లో ఉందన్నారు. పోలవరం విషయంలో అనేక మంది చివాట్లు పెడుతున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే తుగ్లక్లుగా మిగిలిపోతారని వ్యాఖ్యానించారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ సృష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.













