వృద్దులకు రాజా కసుకుర్తి సహాయం: వృద్దులకు చలి దుప్పట్లు పంపిణీ
ఉత్తర అమెరికా తెలుగు సంఘం, తానా ఫౌండేషన్ అధ్వర్యంలో తానా ప్రెసిడెంట్ శ్రీ అంజయ్య చౌదరి లావు గారు, తానా కమ్యూనిటీ సర్వీసెస్ కో ఆర్డినేటర్ రాజా కసుకుర్తి గార్ల సౌజన్యంతో తణుకు మాజీ శాసనసభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారి ఆధ్వర్యంలో సంధ్యా జ్యోతి వృద్ధ జనాశ్రమం తణుకు నందు వృద్దులకు రాజా కసుకుర్తి సమకూర్చిన చలి దుప్పట్లు, పండ్లు, ఆక్సీజన్ కన్సన్ట్రేటర్స్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా తానా ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి గారు మాట్లాడుతూ పేదలకు, వృద్దులకు సేవ చేయడంలో తానా ఫౌండషన్ ఎప్పుడు ముందు ఉంటుంది అని చెప్పారు. సమాజానికి మార్గదర్శనం చేసిన వృద్ధులను గౌరవించడం మన బాధ్యత అని తెలిపారు.
తానా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ జనార్దన్ నిమ్మలపూడి సంధ్యా జ్యోతి వృద్ధ జనాశరమంనకు 50000 రూపాయలు అర్ధిక సహయం ప్రకటించినారు.
ఈ కార్యక్రమంలో తణుకు మాజీ శాసనసభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ గారు, తణుకు పట్టణ తెదేపా అధ్యక్షులు కలగర వెంకట కృష్ణ గారు, తానా కమిటి మెంబెర్ చుండ్రు సతీష్ గారు, బసవ రామకృష్ణ గారు, జయంతి ఖానరాజు గారు,సంధ్యా జ్యోతి వృద్ధాశ్రమం ప్రెసిడెంట్ దొమ్మేటి వింధ్య గారు తెలుగుదేశం తణుకు నాయకులు పాల్గొన్నారు.
ఈ సంధర్భంగా పుస్తక మహొధ్త్యమంలొ భాగంగా తానా కార్యవర్ఘ సభ్యుల పుస్తకములు బహుమతిగా అందించినారు.













