ఏపీ సచివాలయ ఆకృతుల ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సచివాలయ భవన నూతన ఆకృతులను స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు, మంత్రులు, శాసనసభ్యులు పరిశీలించారు. లండన్‌కు చెందిన ఆర్కిటెక్ట్ నార్మన్ పోస్టర్ రూపొందించిన భవన ఆకృతులను పరిశీలించిన అనంతరం ఆకృతులు చూడ చక్కగా ఉన్నాయని, అయితే కార్యాలయ విధులకు అనుకూలంగా విశాలమైన స్థలం ఉండాలని ఆయన సూచించారు. రాజధాని ప్రాంతంలో ఈ తరహా భవన నిర్మాణం కారణంగా ఆర్థిక, సామాజిక, పాలనావ్యవహారాలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని స్పీకర్ వ్యాఖ్యానించారు. అంతుకుమందు శాసనసభ్యులు, మంత్రులు భవన నమూనాలను పరిశీలించి బాగున్నాయంటూ కితాబిచ్చారు.













