విమర్శలు చేయడం కాదు… దాన్ని నిరూపించాలి
టీడీపీ హయాంలో రూ.60వేల కోట్లు అవినీతి జరిగిందంటూ ప్రభుత్వం విమర్శలు చేయడం మాని దాన్ని నిరూపించాలని మాజీ మంత్రి దేవినేని ఉమా సవాల్ విసిరారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైకాపా నాయకులు విమర్శలు చేస్తున్న నీరు చెట్టు పథకం దేశానికే ఆదర్శమని కేంద్ర మంత్రి గతంలో చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్ర మంత్రులు ఆంధ్రప్రదేశ్‌ను పొగుడుతుంటే రాష్ట్ర మంత్రులు అవినీతి జరిగిందని గగ్గోలు పెడుతున్నారని విమర్శించారు. దివంగత సీఎం వైఎస్ హయాంలో పోలవరంలో తట్టెడు సిమెంటైనా వేశారా అని ప్రశ్నించారు. రివర్స్ టెండరింగ్ అంటూ వైకాపా డ్రామా ఆడుతోందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలన్నారు.













