ఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసింది…ఉమా
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పందించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ టీడీపీ పాలనలో పనుల పురోగతిపై సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. గోదావరి-కృష్ణా నదుల అనుసంధానంపై ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. నాలుగేళ్లలో పట్టిసీమ ద్వారా 44 వేల కోట్ల పంట పండిందని పేర్కొన్నారు. బహుశా-వంశధార నదుల అనుసంధానం పనులు ఆపేశారన్నారు. ఉత్తరాంధ్ర మీకేం అన్యాయం చేసిందని ఉమా నిలదీశారు. తోటపల్లి ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడలేకపోయారని నిలదీశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు పనులను ఎందుకు ఆపేశారని ప్రశ్నించారు. జగన్ హౌనం వహించడం సరికాదని, రైతాంగానికి సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. 512 టీఎంసీల నికర జలాలపై ఏపీకి ఉన్న హక్కులను కాపాడుకోవాలన్నారు. ఆల్మట్టి గేట్లు ఎత్తు పెంచాలని కర్ణాటక, మహారాష్ట్ర కలిసి పోరాడుతున్నాయని, దీనిపై జగన్ ఏం సమాధానం చెబుతారన్నారు చంద్రబాబు నాయకత్వంలో పనిచేశామని మరణించే వరకు గర్వంగా చెప్పుకుంటామని దేవినేని ఊమా సృష్టం చేశారు.













