మే 23 తర్వాత ఆ పార్టీ బీజేపీలో విలీనం
మే 23 తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూత పడటం ఖాయమని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు జోస్యం చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీనీ బీజేపీలో విలీనం చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ఈ విషయమై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బీజేపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని అన్నారు. వచ్చే రిపబ్లిక్ డే నాటికి విజయసాయిరెడ్డి జైల్లో ఉంటారని దేవినేని పేర్కొన్నారు. తీహార్ జైల్లోనా, రాజమండ్రి జైల్లోనా అనేది విజయసాయిరెడ్డి తేల్చుకోవాలన్నారు. జగన్, విజయసాయిరెడ్డి జనంలో ఉండదగినవారు కాదని దేవినేని అభిప్రాయం వ్యక్తం చేశారు.













