చంద్రబాబుపై క్రిమినల్ కేసు నమోదు

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై కర్నూలులో క్రిమినల్ కేసు నమోదైంది. సుబ్బయ్య అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు చంద్రబాబుపై కేసు నమోదు చేశారు. కర్నూలులో ఎన్-440కే వైరస్ ఉందని చంద్రబాబు పేర్కొన్నారని, దీంతో జనాలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఐపీసీ 188, 505(1)(బి)(2) సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. అంతేకాకుండా ఈ దుష్ప్రచారంతో చంద్రబాబు పలువురి చావుకు కారణమయ్యారని సుబ్బయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు.