మాపై విమర్శలు చేయడం కాదు… హోదా ఇచ్చారా?
కమ్యూనిస్టులపై విమర్శలు చేయడం కాదు, ప్రత్యేక హోదా ఇచ్చారా? విభజన హామీలను నెరవేర్చారా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితుల గురించి ఏనాడైనా కేంద్రమంత్రులతో గాని ప్రధానితో గాని మాట్లాడారా అని నిలదీశారు. మీ అంత చేతకాని దద్దమ్మ ఇంకొకరు ఉండరు అని మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు డబ్బులు మీ నాయనా ఇచ్చారా? లేక మీ తాతా ఇచ్చారా? అంటూ ప్రశ్నించారు. తలతిక్క మాటలు మాట్లాడితే తోలు తీస్తామని హెచ్చరించారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగులకు రెండు డీఏలు పెండింగ్ పెడితే విమర్శించిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆరు డీఏలు పెండిరగ్లో పెట్టారని అన్నారు. నల్ల బ్యాడ్జీలతో నిరసన చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతల మధ్య జగన్ చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. అమరావతి విషయంలో సీఎం జగన్ లేనిపోని డాంబికాలను పోయి చాలా తప్పు చేశారని అన్నారు.













