ఆ రాష్ట్రాల్లో లేని ఆంక్షలు ఏపీలో ఎందుకు?
ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో పూర్తిగా విఫలమైన ఎన్నికల కమిషన్, ప్రజా సమస్యల పరిష్కారానికి కూడా అడ్డుపడుతోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కరవుతో ప్రజలు, రైతులు ఇబ్బంది పడుతుంటే ఉమశమన చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేసిన మంత్రివర్గ సమావేశంపై ఆంక్షలు పెట్టడం ఆక్షేపణీయమన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మంత్రివర్గ సమావేశాలు నిర్వహిస్తూన్నా పట్టించుకోని సీఈసీ, బీజేపీని వ్యతిరేకిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై మాత్రం ఆంక్షలు పెట్టిందని ఆరోపించారు. అధికారులు ప్రభుత్వానికి సహకరించి ప్రజాసమస్యలను పరిష్కారించాలని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నతాధికారులతో సమన్వయంతో ముందుకు వెళ్లాలని రామకృష్ణ కోరారు.













