ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. వరుసగా రెండో రోజు కూడా నాలుగువేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 39,816 మందికి కరోనా పరీక్షలు చేయగా 4,528 మంది కరోనా సోకింది. కరోనాతో ప్రకాశం జిల్లాలో ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 418 మంది పూర్తిగా కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 18,313 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది.
మరోవైపు సంక్రాంతి పండగపై కరోనా వైరస్ ప్రభావం పడనుంది. ఉభయ రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాలకు చెందిన ప్రజలు సంక్రాంతి పర్వదినాల నేపథ్యంలో సొంతూళ్లకు తరలి వస్తుండడంతో వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడిపందేలు, గుండాటలు, పేకాట పొటీలు, రికార్డింగు డ్యాన్సులు ఉత్సవాల సందర్భంగా వేల సంఖ్యలో ప్రజలు హాజరయ్యే ఆవకాశముంది. దీంతో భారీగా జనసందోహాలు గుమిగూడి ఉండడం వల్ల వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండ వచ్చేనే ఆందోళన వ్యక్తమవుతోంది.