Budameru:దీనివల్ల ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదు: కలెక్టర్ లక్ష్మీశ

ఎన్టీఆర్ జిల్లాలో వరద పరిస్థితిపై హోంమంత్రి అనిత (Home Minister Anitha) , ఇతర ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు కలెక్టర్ లక్ష్మీశ (Collector Lakshmi) తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బుడమేరు వద్ద వరద ఏమీ లేదని, 3 వేల క్యూసెక్యుల నీరు వస్తోందని తెలిపారు. పరిస్థితి అంతా నియంత్రణలోనే ఉందన్నారు. ప్రజలు భయపడాల్సిన పనిలేదని తెలిపారు. పోతుల వాగు, నల్ల వాగు వద్ద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం(Khammam) , వరంగల్ (Warangal ) లో కురుస్తున్న వర్షాలతో మున్నేరుకు వరద నీటి ప్రవాహం వస్తోంది. దీనివల్ల ఏపీలో ఇబ్బందికర పరిస్థితి లేదు. ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద మరో గంటలో మొదటి ప్రమాద హెచ్చరికతో 95 గ్రామాలపై ప్రభావం పడుతుంది. వాళ్లకు పునరావాస కేంద్రాలు ఇప్పటికే ఏర్పాటు చేశాం. కొండ ప్రాంతంలో ఉన్న వారు పునరావాస కేంద్రాలకు తరలివెళ్లాలి . పల్లె నుంచి పట్నం వరకు యంత్రాంగం అప్రమత్తంగా ఉంది అని తెలిపారు.