పవిత్ర హారతి సమర్పించిన చంద్రబాబు
కృష్ణానది ప్రవాహానికి ఇటీవలి కాలంలో అనేక అవరోధాలు వస్తున్నప్పటికీ ఆ నది నిరంతరం ప్రవహించాలని మనసా వాచా కోరుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. జలహారతి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మంగళవారం పవిత్ర సంగమం వద్ద భక్తిప్రపత్తులతో జల హారతి ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న మూడు మాసాల్లో రాష్ట్రం లో పెండింగ్లో ఉన్న 28 ప్రాజెక్టులను పూర్తిచేయాలనే సంకల్పంతో తామున్నామన్నారు. చుక్కనీరు కూడా వృథా చేయరాదని భావితరాలకు తెలియచెప్పేలా విస్తృత ప్రచారం చేయాల్సి ఉందని అన్నారు.













