ప్యాకేజీ వద్దు.. ప్రత్యేక హోదానే కావాలి
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఈ తీర్మానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్యాకేజీ వద్దని, ప్రత్యేక హోదానే కావాలని తీర్మానం చేసి పంపుతున్నామని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అన్యాయం జరిగిందని, విభజన నష్టాలను ప్రత్యేక హోదా ద్వారానే పూడ్చుకోవచ్చునని జగన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. విభజన సమయంలో పార్లమెంట్లో చేసిన వాగ్ధానాలను ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని గత ప్రభుత్వం సరిదిద్దలేదని, ఆ అన్యాయాలు మరింత పెరగటానికి కారణమయ్యిందని విమర్శించారు. విభజన వల్ల సుమారు 59 శాతం జనాభాను, అప్పులను వారసత్వంగా పొందామని అన్నారు. కానీ 47 శాతం ఆదాయం మాత్రమే పొందామని అన్నారు. అన్ని విధాల రాష్ట్రం వెనుకబడిందన్నారు.













