వైఎస్ఆర్ కంటి వెలుగు ప్రారంభించిన సీఎం
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కర్నూలులో ప్రారంభించారు. నూతనంగా నిర్మించనున్న ఆరోగ్య ఉపకేంద్రాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. మార్చి 1 నుంచి అవ్వ, తాతకు కంటి ఆపరేషన్లు చేయించనున్నట్లు తెలిపారు. కంటీ పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి వాలంటీర్ల ద్వారా ఇంటి వద్దే కళ్ల జోళ్లు అందిస్తామని చెప్పారు. మూడేళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రులు రూపురేఖలు మారుస్తామని పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో నాడు-నేడు కు ఇక్కడి నుంచే శ్రీకారం చుడుతున్నామని చెప్పారు. అవసరమైన చోట కొత్త ఆస్పత్రులను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా, కార్పొరేట్ ఆస్పత్రులకు ధీటుగా రూ.15,337 కోట్లతో ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక బోధనాస్పత్రి ఏర్పాటు చేస్తామని తెలిపారు. వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్తే వైద్యులు లేరనే మాట వినిపించకూడదని అన్నారు.













