ఐరాస లో ఏపీకి మంచి గుర్తింపు : చంద్రబాబు
ఐక్యరాజ్యసమితిలో రాష్ట్రానికి మంచి గుర్తింపు లభించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నీరు-ప్రగతి, వ్యవసాయం పురోగతిపై సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏపీ ప్రకృతి సేద్యం ప్రపంచానికే నమూనా కావాలని ఆకాంక్షించారు. ప్రపంచం మొత్తం ఏపీ ప్రకృతి సేద్యం వైపు చూస్తోందని అన్నారు. అటు ప్రకృతి, ఇటు సాంకేతికత రెండింటినీ సమర్థంగా వినియోగించడమే ఏపీ ఘనత అని ముఖ్యమత్రి అభివర్ణించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో దేశంలోనే ముందున్నామని, ప్రపంచంలోనే అత్యన్నత రాష్ట్రంగా ఏపీ కావాలన్నారు. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు పశుగణనను విజయవంతం చేయాలన్నారు. రేపటినుంచి ప్రారంభం కానున్న ముఖ్యమంత్రి యువనేస్తం విజయవంతం చేయాలని అధికారులకు పిలుపునిచ్చారు. ఎల్లుండికల్లా ఖాతాలలో 1,000 రూపాయలు జమచేయాలని ఆదేశించారు.
రాష్ట్రవ్యాప్తంగా 19 శాతం వర్షపాతంలోటు ఉందని, సమర్థ నీటి వినియోగమే అన్ని సమస్యలకు పరిష్కారమని తెలిపారు. జల సంరక్షణ చర్యలే కరవుకు పరిష్కారమని అధికారులకు సూచించారు. రబీ విత్తనాల పంపిణీపై శ్రద్దపెట్టాలని, ఖరీప్ దిగుబడి ముందస్తు అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. 15.7 కోట్ల పనిదినాలను పూర్తిచేశామని, రూ.4,893 కోట్ల నిధుల వినియోగం జరిగిందని ఇంకా 7వేల కోట్ల నిధులను వినియోగించుకోవాలని పేర్కొన్నారు.













