ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసింది : సీఎం చంద్రబాబు
సత్తెనపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో భాగంగా జిల్లాపరిషత్ ఉన్నత పాటశాలలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తున్న ఏపి స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు గారు.
విభజన జరిగినప్పుడు అందరూ భయపడ్డారని, విభజనతో దగా పడ్డాం.. నష్టపోయామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అండగా ఉంటారని ఎన్డీఏలో భాగస్వాములయ్యామని, న్యాయం చేస్తారని నమ్మితే ఎన్డీఏ నమ్మక ద్రోహం చేసిందని ఆయన ఆరోపించారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేసిన పలు కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సత్తెనపల్లిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్రం సహకరించడం లేదని, రివైజ్లు ఆర్థిక ఇబ్బందులున్నాయని.. కేంద్రం నిధులు ఇవ్వడంలేదని అయినా ప్రాజెక్టులకు ఇబ్బందులు లేకుండా ముందుకెళ్తున్నామని అన్నారు. ప్రపంచం మొత్తం ఆహారపు అలవాట్లు మారాయని, దానికి అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు చేస్తున్నామన్నారు. ప్రపంచానికి ఆదర్శంగా 8శాతం సేద్యం సాధించిన ఏకైక ప్రభుత్వం మనదేనని అన్నారు. రైతులకు రూ. 24 కోట్ల రుణ విముక్తి చేసిన ప్రభుత్వం టీడీపీయేనని, రూ. లక్షా 50 వేలు రుణమాఫీ చేశామని, వాళ్ల కంటే ఒకడుగు ముందుంటానని చంద్రబాబు అన్నారు.













