సీఐఐ భాగస్వామ్య సదస్సు .. ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్ -2026’ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
సీఐఐ భాగస్వామ్య సదస్సులో భాగంగా నిర్వహించిన ‘ఉమెన్ అండ్ గ్రోత్ సమ్మిట్-2026’లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
‘‘ది వుమెన్ వు విల్ షేప్ ది నెక్ట్స్ ఎకానమీ: లీడర్షిప్, కేపిట్, ఆంబిషన్’ థీమ్‌తో సమ్మిట్
హాజరైన కేంద్ర మాజీమంత్రి స్మృతి ఇరానీ, సీఐఐ అలియన్స్ ఫర్ గ్లోబల్ గుడ్ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, మహిళా నాయకులు
మహిళలకు మూలధనం, మార్కెట్ అవకాశాలు, సాంకేతికత, నైపుణ్యాలు, నాయకత్వ శిక్షణ అందించడంపై సదస్సులో చర్చ
ఐటీని హైదరాబాద్‌కు తీసుకురావడంలో, బయోటెక్నాలజీ, లైఫ్ సైన్సెస్‌లో ఏపీ ముందంజలో ఉండటానికి సీఎం చంద్రబాబు కారణం : సుచిత్రా ఎల్లా, సీఐఐ ప్రెసిడెంట్
భారత్ బయోటిక్‌ను 1996లో హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబు మార్గదర్శకత్వంలోనే స్థాపించాం: సుచిత్రా ఎల్లా
భారతదేశ అభివృద్ధిలో మహిళలు ముందుండాలి…ఎంట్రప్రెన్యూర్లుగా, పెట్టుబడిదారులు, నూతన ఆవిష్కరణలు ప్రవేశ పెట్టేలా మహిళలు ఎదగాలి : సుచిత్రా ఎల్లా
ప్రధాని మోదీ నాయకత్వంలో మహిళలు దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్నారు…అన్ని రంగాల్లోనూ మహిళల ట్రాన్సఫర్మేషన్ జరగాల్సి ఉంది: కేంద్ర మాజీమంత్రి స్మృతీఇరానీ
సదస్సులో ప్రసంగించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…
• ఇటీవల ఏపీలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో 5 స్థానాలు మహిళలకు లభించినా…మేం 8 మంది మహిళలకు మేయర్లుగా అవకాశం కల్పించాం
• పుట్టుక నుంచి మహిళల విషయంలో వివక్ష కనిపిస్తుంది… కొడుకు మనతో ఉంటాడు…కూతురుకు పెళ్లి చేసి పంపించేస్తాం అనే ఆలోచన సమాజంలో ఉంది
• దేశాన్ని ఈరోజు ఆర్ధిక శక్తిగా నిర్మలా సీతారామన్ నడిపించడం సంతోషంగా ఉంది… అవకాశం ఇస్తే విజయాలు సాధిస్తారు…
• డ్వాక్రా మహిళలు తాము తీసుకున్న రుణాల్లో 99.6 శాతం రీపేమెంట్ చేస్తున్నారు…
• 1.13 కోట్ల మంది మహిళలు స్వయం సహాయక సంఘం సభ్యులుగా ఉన్నారు…రూ.30,000 కోట్ల కార్పస్ ఫండ్ ఉంది…ఇప్పుడు దాదాపు రూ.1 లక్ష కోట్ల టర్నోవర్ చేస్తున్నారు…
• మహిళలు దగ్గర రూ.10 ఉంటే రూ.100 వ్యాపారం చేయగలుగుతారు…స్వయం ఏపీ బ్రాండ్‌తో డ్వాక్రా మహిళల ఉత్పత్తులకు మార్కెట్ కల్పిస్తున్నాం..
• మహిళలు ఎవరికీ తక్కువ కాదు…నేను విద్య, ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాను… ఐటీ రంగంలో మహిళలే ఎక్కువ ఆర్జిస్తున్నారు…
• ఈ రోజు స్థానిక సంస్థల్లో 50 శాతం మహిళలు ఉండటం సంతోషంగా ఉంది…వారంతా విద్యావంతులే…వైజాగ్ మేయర్ కూడా మహిళే
• అత్యంత విద్యావంతులైన మహిళల్ని మేయర్లుగా, చైర్పర్సన్లుగా, జడ్పీ చైర్పర్సన్లుగా అవకాశం ఇచ్చాం.
• రాజకీయ పార్టీలన్నీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల కోసం కృషి చేయాలి.
• ఇటీవల ఓపీ జిందాల్ విశ్వవిద్యాలయం నిర్వహించిన సర్వేలో సమాన అవకాశాలు కల్పించడంలో గోవా తర్వాత ఏపీ 2వ స్థానంలో ఉంది…
• అందరికీ అవకాశాలు ఉండాలి…అందరూ ఎదగాలి అనేది నా సంకల్పం..
• ఇటీవల విశాఖ, విజయవాడ, మంగళగిరిలో రూ.50,000 కోట్ల విలువైన 60,000 ఇళ్ల పట్టాలు ఇచ్చాం..మహిళలకు విలువైన ఆస్తి ఇవ్వగలిగాం..
• మహిళల పేరున ఆస్తి ఉంటే దానిని కాపాడుకుంటారనే నమ్మకం ఉంది…అలాగే, మహిళలకు భద్రత లభిస్తుంది…
• ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో 35.8 శాతం మహిళా శ్రామిక శక్తి ఉంది…దీనిని త్వరలోనే 50 శాతానికి తీసుకువెళ్తాం…
• విశాఖ బాండెక్స్లో దుస్తుల తయారీ కేంద్రంలో 20 వేల మంది మహిళలు పనిచేస్తున్నారు…గ్లోబల్ టాయ్ పార్క్‌లో 30 వేల ఉద్యోగాలు మహిళల కోసం ఉన్నాయి…
• కుప్పం, అనంతపురం…ఇలా అన్ని చోట్లా పెట్టుబడులు వస్తున్నాయి…ఈ ప్రాజెక్టుల్లో అధికంగా మహిళలకే ఉద్యోగాలు వస్తాయి…
• ప్రకృతి వ్యవసాయంలో కూడా మహిళలు అద్భుతాలు చేస్తున్నారు…రైతులకు పెద్దఎత్తున శిక్షణ ఇస్తున్నారు…ఏపీలో 25 లక్షల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం జరుగుతోంది..
• రాష్ట్రంలో మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం…ఎక్కాడా రాజీ పడటం లేదు.
• పీ4, పీపీపీ విధానాలతో మహిళలకు మేలు జరుగుతోంది…వారు సంపద సృష్టిస్తున్నారు..
• సమాజంలో అసమానతలు రూపుమాపడానికి సుచిత్రా ఎల్లా, చంద్రజిత్ బెనర్జీ వంటి వారు దీనిపై పనిచేయాలి…
• మొదటిసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుచిత్ర ఎల్లా, కృష్ణా ఎల్లాను బయోటెక్నాలజీలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించాను..ఇప్పుడు అదే సంస్థ కరోనా సమయంలో కోట్లాది ప్రజల ప్రాణాలను కాపాడింది…
• ప్రధాని నరేంద్ర మోదీ చాలా దేశాలకు వ్యాక్సిన్ అందించారు…అదీ ఆ సంస్థ ప్రతిభ
• సమాజం నుంచి లబ్ది పొందడమే కాకుండా…సమాజానికి తిరిగిచ్చేలా మహిళలు స్ఫూర్తిగా నిలవాలి…
• కార్పొరేట్ సోషల్ రెస్పాన్సబిలిటీ కింద ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవు… కార్పొరేట్ సంస్థలు పీ4 కింద బంగారు కుటుంబాలను దత్తత తీసుకోవాలని కోరుతున్నాను…
• ఎంబీకే కింద సమాజంలో సంపన్నులు 10 శాతం… అత్యల్ప ఆదాయ వర్గాలైన 20 శాతం కుటుంబాలకు అండగా నిలవాలి…
• పేదల ఆదాయ మార్గాలు పెరగాలి… జీవన ప్రమాణాలు పెరగాలి… లేదంటే పేదరికం శాశ్వతంగా ఉండిపోతుంది…సంపన్నులు మరింత సంపన్నులు అవుతారు..
• సమాజంలో పేదరికం పెరిగితే విపరిణాలు తలెత్తుతాయి…యూరోపియన్ దేశాల్లో మనం ఇప్పుడు అవే సంఘటనలు చూస్తున్నాం..
• కుప్పంలో ఓ మహిళ ఇటుకల తయారీ కేంద్రంలో పనిచేసి…చివరికి ఆ సంస్థకే యజమాని అయ్యారు..ఇప్పుడు ఆమె సంవత్సరానికి రూ.25 లక్షల ఆదాయం ఆర్జిస్తున్నారు…
• పేదరికంలో కోటి 10 లక్షల కుటుంబాల కోసం…అందులోనూ మహిళల కోసం పనిచేస్తాం..
• వెలుగు నుంచి స్వయం ఏపీ బ్రాండ్ వరకు స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి కృషి చేశాను… మహిళా పారిశ్రామిక వేత్తలు మరింతగా రావాలి..
• వచ్చే సీఐఐ సదస్సులో 50 శాతం మహిళల భాగస్వామ్యం ఉండాలి…మహిళల రాజకీయ సాధికారతతో పాటు ఆర్ధిక సాధికారతకు మేం అండగా ఉంటాం…
• సుచిత్రా ఎల్లా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు…రాష్ట్రంలో 54 చేనేత క్లస్టర్లు ఉన్నాయి..వీటిలో చాలా వరకు మహిళా సంఘాల నేతృత్వంలో పనిచేస్తున్నాయి…
• గతంలో నేను ఐటీ గురించి మాట్లాడేవాడిని…ఇప్పుడు ఏఐ గురించి ఎక్కువ ప్రస్తావిస్తున్నాను.. డేటా సెంటర్లు, క్వాంటం, స్పేస్, డ్రోన్, ఎలక్టానిక్స్, సెమీ కండక్టర్ రంగాలకు అధ్బుతమైన పురోగతి ఉంది…
• మారుతున్న టెక్నాలజీతో ఏమైనా సాధించగలం…స్కై రూట్ వంటి సంస్థలు ఇది నిరూపిస్తున్నాయి..
• తిరుపతిలో సెమీ కండక్టర్ల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాం..తిరుపతిని గ్లోబల్ డిజైన క్యాపిటల్ గా తీర్చిదిద్దుతాం..చైనాతో సమానంగా తిరుపతిలోనే సెమీకండక్టర్లు ఉత్పత్తి జరిగేలా చేస్తాం…
• భవిష్యత్‌లో యుద్ధాలన్నీ డ్రోన్లు, రోబోటిక్స్‌తోనే జరుగుతాయి..టెక్నాలజీ అంతలా ప్రభావం చూపిస్తుంది…కర్నూలులో తయారైన డ్రోన్ ఆపరేషన్ సింధూర్లోనూ ఆపరేట్ చేశారు..
• మహిళలు కూడా సాంకేతికతపై దృష్టి పెట్టాలి…అవకాశఆలు అందుకోవాలి… ఆ సమర్ధత మహిళలకు ఉంది..
• రాజకీయ, ఆర్ధిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం 50 శాతం మించినప్పుడే నాకు సంతృప్తి…ముఖ్యమంత్రిగా నేను అండగా ఉంటాను..
• మహిళా పారిశ్రామిక వేత్తలు ఎక్కువ రాయితీలు అందిస్తున్నాం…దావోస్ సమ్మిట్‌కు ఏపీ నుంచి ఐదుగురు మహిళా పారిశ్రామిక వేత్తలు హాజరయ్యేలా సహకరిస్తాం..
• మహిళల కోసం ప్రత్యేకంగా టెక్ పార్క్ ఏర్పాటు చేసి… వారికి ఉచితంగా భూమి, అలాగే ప్రోత్సాహకాలు అందిస్తాం







