Modi: ప్రధాని పర్యటనను విజయవంతం చేయాలి : చంద్రబాబు

ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పర్యటనను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) సూచించారు. ఈ పర్యటనపై సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ విధానాలతో రాష్ట్రానికి అనేక ప్రయోజనాలున్నాయి. ప్రధాని శ్రీశైలం (Srisailam) , కర్నూలు (Kurnool) పర్యటనలను విజయవంతం చేద్దాం. కేంద్రం సహకారంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున లాభం చేకూరుతోంది. గూగుల్ ఏఐ డేటా హబ్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం. ఈ హబ్‌లో ఏర్పాటుకు మంగళవారం ఒప్పందం చేసుకున్నాం. ఈ హబ్ రావడంలో ప్రధాని కేంద్ర మంత్రుల చొరవ ఉంది. గూగుల్ రావడానికి మంత్రి నారా లోకేశ్ ప్రధాన పాత్ర పోషించారు. అధికారంలోకి రాగానే గూగుల్ ప్రతినిధులను సంప్రదించారు. 15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. దేశంలోనే ఇది అతిపెద్ద విదేశీ ప్రత్యక పెట్టుబడి. గత పాలకులు చేసిన విధ్వంసంతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. వారి తప్పులను సరిచేయడానికే చాలా సమయం పట్టింది. యోగాంధ్ర, అమరావతి రీస్టార్ట్ కార్యక్రమాలను విజయవంతం చేశాం. ఇప్పుడు ప్రధాని మోదీ పాల్గొనే సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ విజయవంతం చేద్దాం. రాయలసీమకు పెద్దఎత్తున పరిశ్రమలు తీసుకొస్తున్నాం. గత పాలకులు సీమలోని సాగునీటి ప్రాజెక్టులను పట్టించుకోలేదు. తిరుపతి, శ్రీశైలం, గండికోటను పర్యాటకంగా అభివృద్ది చేస్తున్నాం. హెల్తీ, వెల్తీ హ్యాపీ ఏపీ సాధనే లక్ష్యంగా అంతా పనిచేయాలి అని అన్నారు.