విజ్ఞాన కేంద్రంగా అమరావతి
రాజధాని అమరావతిలో సమీప భవిష్యత్తులో 13 వైద్య కళాశాలలు ఏర్పాటు కానున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఉపాధ్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎ ప్లన్ కన్వెన్షన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని 31 మంది ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీతలను సత్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రాన్ని నాలెడ్జి సొసైటీగా, ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేనన్ని యూనివర్శిటీలు వచ్చే అవకాశాలున్నాయని, ఇప్పటికే శ్రీ రామస్వామి మెమోరియల్ (ఎస్ఆర్ఎం) ప్రారంభమైందని, నెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (విట్) ఇప్పటికే తరగతులు ప్రారంభించిందని గుర్తు చేశారు. అమృత్ వచ్చిందని, ఇండో యూకె ఆధారిత కింగ్స్ కళాశాల వైద్యశాల అమరావతికి వచ్చిందని చెప్పారు. దుబాయ్‌కు చెందిన బిఆర్ షెట్టి వేయిపడకలతో కూడిన వైద్యశాల రానున్నదని వివరించారు. దేశంలో మరే రాష్ట్ర రాజధానిలో కూడా ఒకే చోట ఇన్ని మెడికల్ కాలేజీలు ఎక్కడా లేవన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పుట్టిన రోజు నాడు ఆయన శిష్యులు సత్కరించారని, అప్పుడాయన తనని సత్కరించనవసరం లేదని, ఈ రోజును ఉపాధ్యా దినోత్సవంగా పాటించాలని ఆయన కోరారని తెలిపారు. నాటి నుంచి దేశంలో ఉపాధాయ దినోత్సవం నిర్వహించటం అనవాయితీగా వస్తోందన్నారు. సిలికాన్ వ్యాలీలో తలసరి ఆదాయం అక్కడికి వెళ్లి స్థిరపడిన తెలుగువారికే ఉందని సగర్వంగా చెబుతున్నానని అన్నారు.













