రాష్ట్రపతితో చంద్రబాబు బృందం భేటీ
ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడి, తీర్పు కోరాలని నిర్ణయించుకున్నాం
రాష్ట్రపతికి వినతిపత్రం ఇచ్చిన అనంతరం మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి
రాష్ట్రపతిని ప్రజాసంఘాలు, జర్నలిస్టు సంఘాలతో వెళ్లి కలిశాం.
• విభజన హామీల అమలు విషయంలో రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం
• నూతన రాజధాని అమరావతి నిర్మాణంపై రాష్ట్రపతికి వివరాలు అందించాను
• అమరావతి రాజధాని నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1500 కోట్లు మాత్రమే ఇచ్చారని రాష్ట్రపతికి తెలిపాను
• ఇప్పటిదాకా ఏపీ రెవెన్యూ లోటు భర్తీకి కేంద్రం ఎటువంటి చర్యలు చేపట్టలేదు
• ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని చూసి యావత్ దేశం కలత చెందుతోంది
• నాడు పార్లమెంట్ లో విభజనన జరిగిన తీరుపై రాష్ట్రపతికి వివరించాం
• ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇస్తామని రాజ్యసభ వేదికగా విభజించే నాడు చెప్పారు. ఐదేళ్లు కాదు పదేళ్లు హోదా ఇస్తామన్నారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు..మొండిచేయి చూపించారు.
• ఉద్యమాలు చేసి ఆంధ్రరాష్ట్రాన్ని నాడు సాధించుకున్నాం. ఆంధ్రరాష్ట్ర కోసం పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగం చేశారు.
• భాషా ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.
• 60 యేళ్లుగా ఇబ్బందులు పడ్డాం. విభజన జరిగింది. సమస్యలు అలాగే ఉన్నాయి.
• రాష్ట్ర ప్రయోజనాల కోసం మేం నిన్న ఢిల్లీ వేదికగా ధర్మపోరాట దీక్ష చేశాం. ఇది ధర్మం కోసం చేసిన పోరాటం.
• కేంద్రం ప్రభుత్వం ధర్మాన్ని నిర్లక్ష్యం చేసింది. ఏపీ రాష్ట్రాన్ని అన్యాయం చేసింది
• విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా మోసం చేసింది.
• విభజన చట్టం హామీలను అమలు చేయాలని ఏళ్ల తరబడి కోరుతున్నా కేంద్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసింది.
• అమరావతి శంకుస్థాపనకు వచ్చినప్పుడు మోదీ యమునా నది నీళ్లు, పార్లమెంట్ మట్టి తీసుకువచ్చారు
• ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి మట్టి, కుండలను ఇచ్చి అవమానపరిచారు..
• ప్రస్తుత మోదీ ప్రభుత్వం తల్లిని, బిడ్డను ఇద్దరినీ చంపేసింది.
• హైదరాబాద్, సైబరాబాద్ ను అద్భుతంగా తీర్చిదిద్దిన ఘనత తెలుగువాళ్లది.
• హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి చాలా కృషి చేశాను
• ప్రస్తుతం అమరావతిని కూడా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా అబద్ధాలతో బీజేపీ కాలక్షేపం చేసింది. కాలయాపన చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవితాలతో బీజేపీ ఆడుకుంటుంది.
• ప్రధాని నరేంద్ర మోదీలో నాయకత్వ లక్షణాలు లేవు
• దేశాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన, ఆశయం మోదీకి లేదు
• విభజన చట్టంలో పెట్టిన అంశాలను మాత్రమే అమలు చేయాలని కోరుతున్నాం…అయినా మా సమస్యలను కేంద్రం అస్సలు పట్టించుకోవటం లేదు. నిర్లక్ష్యం చేసింది.
• 60 యేళ్లుగా ఇబ్బందులు పడ్డాం…విభజన జరిగింది… సమస్యలు అలాగే ఉన్నాయి
• ప్రాంతాల ఆధారంగా ఆస్తుల విభజన జరగడం వల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయింది
• చాలా ఆస్తులు తెలంగాణకు చెందడంతో ఆంధ్రప్రదేశ్ కు అప్పులే మిగిలాయి
• అందుకే హామీల అమలులో కేంద్ర నిర్లక్ష్య వైఖరి గురించి రాష్ట్రపతికి వివరించాం
• ఒక వ్యక్తి నిన్న ఢిల్లీలో ప్రాణత్యాగం చేశారు. రాష్ట్రప్రయోజనాల కోసం తన వైకల్యాన్ని సైతం లెక్కచేయకుండా ఢిల్లీకి వచ్చి తన గళం వినిపించి మరణించాడు. ఒక సాధారణ మనిషికి ఉన్న ప్రేమ కేంద్ర ప్రభుత్వానికి లేదు.
• విభజన చట్టం హామీల అమలు విషయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సహకరిస్తానంది.
• అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా, పోలవరానికి నిధులు ఇస్తామని కాంగ్రెస్ చెప్పింది.
• పొత్తుల విషయంలో రాష్ట్ర ప్రజల మనోభావాలు తెలుసుకున్నాక నిర్ణయం తీసుకుంటాం
• ఇప్పటిదాకా రాష్ట్రంలో 11 జిల్లాలో ధర్మపోరాట దీక్షలు చేశాం. ఢిల్లీ వేదికగా నిన్న పోరాటం చేశాం. ఆ తర్వాత రాజధాని అమరావతిలో పెద్ద ఎత్తున ధర్మపోరాట దీక్ష చేయాలని నిర్ణయించాం
• ప్రజాక్షేత్రంలోకి వెళ్లి పోరాడి, తీర్పు కోరాలని నిర్ణయించుకున్నాం
• రాష్ట్రపతి రాజ్యాంగపరమైన అధినేత..కేంద్రానికి మా తరపున వినతిని అందజేయమని చెప్పాం..అంతిమంగా విధాననరమైన నిర్ణయాలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే.
• ప్రజాస్వామ్య వాదులందరూ మేం చేసే పోరాటానికి మద్ధతు తెలుపుతున్నారు. ఇది సంతోషించ దగ్గ పరిణామం. కానీ జగన్ లాంటి నేతలు కనీసం మద్దతు కూడా తెలపలేదు.
• నేను ప్రధాన మంత్రి అవమానపరిచానని వైసీపీ అంటోంది.. నేను ప్రోటోకాల్ పాటించలేదని ప్రచారం చేసింది. బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేసినా కూడా ప్రభుత్వం తరపున ప్రోటోకాల్ గా సీఎస్, డీజీపీ, కలెక్టర్ స్వాగతించడానికి వెళ్లారు. మాకు అన్యాయం చేసిన వారికి స్వాగతం పలకడానికి నేనెందుకు వెళ్లాలి ?
• హైదరాబాద్ లో ఉంటున్న జగన్ కు రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదు.హైదరాబాద్ లో ఉంటూ అమరావతిలో ఓటు ఎలా అడుగుతారు ?
• ఓట్ల కోసం జగన్ రాష్ట్రాన్ని మోదీ వద్ద తాకట్టు పెడతారా?













