Chandrababu: ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో చేపడుతున్న సంక్షేమ పథకాల విషయంలో వైఎస్ జగన్‌కి ఎదురుదెబ్బలే ఎక్కువగా తగులుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రాష్ట్రానికి చెందిన కూటమి ఎంపీల (MPs)తో సమావేశమయ్యారు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయంలో సుమారు 40 నిమిుుషాల పాటు వివిధ అంశాలపై వారితో మాట్లాడారు. ఒక్క వైద్య కళాశాలల (Medical colleges) పీపీపీ వ్యవహారం మాత్రమే వైసీపీకి దొరికింది. ఆ విషయంలో కూడా ప్రజలు వాళ్లకి అవకాశం ఇవ్వలేదు. కోటీ సంతకాల పేరుతో డ్రామా చేయాలని జగన్ (Jagan)చూశారు. కానీ అది కూడా ఫెయిలైంది. ఢిల్లీ స్థాయిలోనూ పీపీపీ విధానంపై ఎంపీలు అధ్యయనం చేయాలి అని చంద్రబాబు సూచించారు. ప్రస్తుతం ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో పీపీపీ పద్ధతిలో ఆస్పత్రులు నడుస్తున్న విషయాన్ని పలువురు ఎంపీలు సీఎంకు వివరించారు. మనకు గుర్తింపు పెరుగుతున్న కొద్దీ బాధ్యత ఎక్కువ అవుతుందని చంద్రబాబు అన్నారు. మరింత బాధ్యతతో పనిచేయాల్సిన అవసరముందని తెలిపారు.






