సివిల్స్ ఫలితాల్లో మూడో ర్యాంక్ సాధించిన గోపాలకృష్ణకు సీఎం అభినందన
సివిల్స్ ఫలితాల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన గోపాలకృష్ణ అఖిల భారత స్థాయిలో 3వ ర్యాంక్ సాధించడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు. విజేత గోపాలకృష్ణ, కష్టపడి చదవించిన అతని తండ్రి అప్పారావులకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. సిలిల్స్ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం ప్రభుత్వం లక్షలు ఖర్చు చేస్తూ శిక్షణ ఇప్పిస్తోందని, గోపాలకృష్ణ విజయాన్ని స్ఫూర్తిగా తీసుకుని యువత రాష్ట్రం గర్వించే విజయాలు సాధించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.













