విశాఖలో ఏపీ భాగస్వామ్య సదస్సు
ఆంధ్రప్రదేశ్ పార్ట్నర్షిప్ సమ్మిట్‌కు విశాఖపట్నం మస్తాబైంది. వరుసగా మూడో ఏడాది ఈ ఆర్థిక నగరంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమయింది. గత రెండు సదస్సుల సందర్భంగా రూ.14 లక్షల కోట్ల విలువైన ఎంఒయులను రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకొంది. ఈ క్రమంలో ఈసారి రూ.మూడు లక్షల కోట్లకు పైగానే ఒప్పందాలు ఖారారు కానున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి ఎన్ అమర్నాథ్ రెడ్డి ప్రకటించారు. సిఐఐ భాగస్వామ్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మూడు రోజులపాటు జరిగే ఈ సదస్సుకు ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి సురేశ్ ప్రభు, కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శితో సహా ఇతర ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.













