విశాఖలో పారిశ్రామిక సదస్సు!
పెట్టుబడులను ఆహ్వానించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్దమవుతోంది. విశ్వసనీయవర్గాల సమాచారం మేరకు ఇటీవల భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రతినిధులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. 2016 నుంచి వరుసగా మూడేళ్లపాటు విశాఖలో పారిశ్రామిక భాగస్వామ్య సదస్సును నిర్వహించారని తెలిపారు. ఈ ఏడాది కూడా నిర్వహించాలని కోరారు. ఈ ప్రతిపాదనకు జగన్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. విశాఖలోనే ఈ సదస్సును నిర్వహించాలన్న సూచనకు కూడా సూత్రప్రాయ ఆమోదం తెలిపినట్టు సమాచారం. దీనికి సంబందించిన లోతుపాతులను సమీక్షించి తదుపరి చర్యలు తీసుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శిని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిసింది.













