చిత్తూరు ఎఎస్పి అరుదైన రికార్డు
రష్యాలోని ఎత్తైన పర్వతమైన మౌంట్ ఎల్బృస్ చిత్తూరు జిల్లా ఏఎస్పీ రాధిక విజయవంతంగా అధిరోహించి మరో అరుదైన రికార్డును సాధించారు. భారత దేశం నుంచి ఈ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళా పోలీసు అధికారిగా కీర్తి గడించారు. మౌంట్ ఎల్బృస్ యూరోపియన్ ఖండంలో ఎత్తైన పర్వతం, దీని ఎత్తు 18,510 అడుగులు, ఎంతో క్లిష్టతరమైన ఈ పర్వతాన్ని ఏఎస్పీ రాధిక ఈనెల 8న అధిరోహించి భారత దేశ జాతీయ పతాకాన్ని ఎగురువేశారు. పర్వతారోహణలో దిట్ట అయిన రాధికా ఇప్పటికే ప్రపంచ లోనే ఎత్తైన అనేక పర్వత శ్రేణులను అధిరోహించారు. ఎవరెస్ట్ శిఖరంతో పాటు, ఆఫ్రికాలోని కిలిమంజారో, ఆస్ట్రేలియాలోని కొసిజో, యూరప్ లోని ఎల్బ్రిన్ పర్వత శిఖరాలను ఆధిరోహించారు. వివిధ దేశాలల్లో ఉన్న ఎత్తైన పర్వతాలను అధిరోహించి ప్రత్యేకతను చాటుకున్నారు.













