మళ్లీ విజయం సాధిస్తాం : చినరాజప్ప
తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందిన నిమ్మకాయల చిన రాజప్ప తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఐదు సంవత్సరాల పాటు తాను కష్టపడి పని చేయడానికి తోడుగా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అండగా నిలిచాయని, అందుకే విజయం సాధించానని చెప్పారు. చంద్రబాబు నాయుడు కష్టపడి పని చేసినా ప్రజల తీర్పు వ్యతిరేకంగా వచ్చిందని, ఆ తీర్పును శిరసావహిస్తామని తెలిపారు. లోపాలు ఏమీ జరిగాయో తెలుసుకుని వాటిని సరిదిద్దుకుంటామని, పార్టీని ముందుకు తీసుకువెళ్లి, మళ్లీ విజయం సాధించేందుకు పాటుపడతామని అన్నారు.













